Saturday, May 4, 2024

నేడు ఖైరతాబాద్‌ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం.!

spot_img

లోకసభ ఎన్నికల వేళ నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ పాల్గొంటారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని నేతలంతా హాజరు కానున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై కేటీఆర్ నేతలతో చర్చిస్తారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు.

కాగా అటు తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సంక్షోభం నెల‌కొంద‌ని.. ఇది బాధాక‌ర‌మైన ప‌రిస్థితి అని తెలిపారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాలుగు నెల‌ల్లోనే రైతుల‌కు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన రైతుదీక్ష‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

ఎర్ర‌టి ఎండ‌ల్లో కేసీఆర్ రైతుల ద‌గ్గ‌రికి వెళ్లి భ‌రోసా ఇచ్చారు. కేసీఆర్ బాట‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు దీక్ష‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోయారు. పాలిచ్చే బ‌ర్రెను పంపించి దున్న‌పోతును తెచ్చుకున్నామ‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు. ఎల‌క్ష‌న్ కోడ్ వ‌చ్చింద‌ని సీఎం, మంత్రులు చావుక‌బురు చెబుతున్నారు. పాల‌న త‌న చేతుల్లో లేద‌ని సీఎం రేవంత్ అన‌డం సిగ్గు చేటు. రేవంత్‌కు చిత్త‌శుద్ధి ఉంటే రైతులు ముందుకు రావాలి. పంట‌ల‌కు బోన‌స్ ఇస్తామ‌ని ఈసీకి రేవంత్ లేఖ రాయాలి. మేం కూడా మ‌ద్ద‌తిస్తాం.. మీ తీరుగా ఎక్క‌డా అడ్డుకోం. పంట‌ల‌కు క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇది కూడాచదవండి: ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్లు మోస్తరు చిరుజల్లులు.!

Latest News

More Articles