Friday, May 17, 2024

తెలంగాణ వాసుల విడుదల కోసం దుబాయ్ లో కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు

spot_img

హైదరాబాద్‌: బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకుని రాజన్న సిరిసిల్ల అర్బన్‌ మండలం పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశం, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్‌, శివరాత్రి హనుమంతులు దుబాయ్ వెళ్లారు. అయితే, 2005లో నేపాల్‌కు చెందిన దల్‌ ప్రసాద్‌ రాయ్‌ మృతి కేసులో వీరిని అక్కడి కోర్టు దోషులుగా తేల్చింది. అప్పటినుంచి వారు దుబాయ్‌లోని అవీర్‌ జైల్లో మగ్గుతున్నారు.

Read Also.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన. అత్యవసర నెంబర్లు ఇవే

తాజాగా తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికా నుంచి దుబాయ్‌ చేరుకున్న కేటీఆర్‌.. బుధవారం భారత కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయ అధికారులు, దుబాయ్‌ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్‌ లాయర్‌తో సమావేశమై వీరి విడుదల గురించి చర్చించారు. షరియా చట్టం ప్రకారం ఖైదీల నేరంతో నష్టపోయిన నేపాల్‌ బాధిత కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారాన్ని దియా రూపంలో అందించామని వారికి గుర్తుచేశారు. 2013లోనే క్షమాభిక్షకు అవసరమైన అన్ని రకాల పత్రాలను దుబాయ్‌ ప్రభుత్వానికి అందించామన్నారు. అయినా ఇంతవరకు ఖైదీల విడుదల అంశం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao.. ఈ సారి జగ్గారెడ్డి కి విశ్రాంతి ఇవ్వండి

అనంతరం మంత్రి కేటీఆర్‌ దుబాయ్‌ కాన్సుల్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్న రామ్‌కుమార్‌తో పాటు తెలంగాణ ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశమై ఖైదీల క్షమాభిక్ష ప్రక్రియ పురోగతి గురించి తెలుసుకున్నారు. దుబాయ్‌ రాజు క్షమాభిక్ష ప్రసాదిస్తేనే విముక్తి లభిస్తుందని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జరిగిన బిజినెస్‌ సమావేశాల సందర్భంగా రాజ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్న పలువురు వ్యాపార వేత్తలతోను వీరి గురించి మంత్రి ప్రస్తావించారు.వారి క్షమాభిక్ష కోసం సహకరించాలని కోరారు.

Latest News

More Articles