Sunday, May 19, 2024

తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే అనంతలోకాలకు..!!

spot_img

తన తండ్రి సాయన్న ఆశయాలను నెరవేర్చకుండానే కూతురు లాస్య నందిత అనంతలోకాలకు వెళ్లారు. 1984 నుంచి సాయన్న రాజకీయాల్లో ఉన్నారు. 4 శతాబ్దాల సుదీర్ఘ ప్రజాజీవితం సాయన్నది. నిత్యంతో జనంతో మమేకం అయ్యే సాయన్న ఎన్నో జయాపజాలకు అతీతంగా పనిచేశారు. ఎప్పుడూ బయటే ఉండేవారు. సాయన్నకు ముగ్గురు ఆడ పిల్లలు. అందులో లాస్య చిన్నది. లాస్య అంటే సాయన్న ఎంతోప్రేమ.

కంప్యూటర్ సైన్స్ బీటెక్ చదవింది లాస్య. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చింది. వాళ్ల నాన్న ఆదేశంలో 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుంచి పోటీ చేసి కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ అపజయం తనను బాధ కలిగించిందని లాస్య కొన్ని సందర్భాల్లో తెలిపింది. ప్రజాజీవితంలో ఇవన్నీ సాధారణమేనని, మహానేతలకే ఓటమి తప్పలేదని తన నాన్న ఓదార్చిన విషయాన్ని చెప్పుకొచ్చింది. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు. నిత్యం జనం మధ్యే ఉన్నారు.

కానీ 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో సాయన్న ఆరోగ్యం దెబ్బతిన్నది. అనుక్షణం తన తండ్రితోనే గడిపింది. కంటోన్మెంట్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించింది. సాయన్న మరణం తర్వాత చాలా కుంగిపోయిన లాస్య…బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పూర్తితో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడిప్పుడే యువతనేతగా తన నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేస్తున్న లాస్య అకాల మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన తండ్రి ఆశయాలను నెరవేర్చుకుండానే అనంత లోకాలకు వెళ్లిదంటూ కన్నీంటి పర్యమంతవుతున్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..!!

Latest News

More Articles