Saturday, May 18, 2024

అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ

spot_img
  • ఘనంగా లూయిస్ బ్రేయిలి జయంతి వేడుక
  • దేశంలో నే అత్యంత ఎత్తయినా బ్రేయిలి విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ అని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. లూయిస్ బ్రేయిలి 124 వ జయంతి సందర్బంగా హైదరాబాద్ మలక్ పేటలో మంగళవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా లూయిస్ బ్రెయిలీ తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహామూద్ అలీ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్ట‌ర్ కే వాసుదేవ రెడ్డి  ఆవిష్క‌రించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు.

లూయీస్ బ్రెయిలీ అంధులకు కవాటాలు ప్రసాదించిన మహనీయుడని కొనియాడారు. కంటి చూపు లేని వారికి లిపిని అందించిన ఘనత లూయిస్‌ బ్రెయిలీకి దక్కిందన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తన అంధత్వాన్ని జయించాడని, అంధుల కోసం బ్రెయిలీ లిపిని రూపొందించారాని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా కోణంలో ఆలోచించి వికలాంగుల సంక్షేమం కోసం కోట్ల నిధులు ఖర్చు చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని స్ప‌ష్టం చేశారు.

దేశంలోనే ఏ రాష్ట్రం లో లేని విధంగా దివ్యంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ న్నామని చెప్పారు. రాష్ట్రంలోని 5 లక్షల 51 వేల మంది వికలాంగులకు సంవత్సరానికి రూ. 2000 కోట్లను ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఉమ్మడి పాలనలో 30 శాతం సబ్సిడీతో మాత్రమే సహాయ ఉపకరణాలు అందేవని ఇప్పుడు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అనేక సహాయ ఉపకరణాలను అందిస్తున్నామని తెలిపారు.

విక‌లాంగుల సంక్షేమ శాఖ బ‌డ్జెట్ రూ. 20 కోట్ల నుంచి రూ. 83 కోట్ల‌కు పెంచార‌ని వెల్లడించారు. స్పష్టమైన లక్ష్యం, పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, కార్యదీక్ష, పట్టుదల, కృషి ఉంటే మనిషి దేనినైనా సాధించవచ్చని దివ్యంగులు నిరూపిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సహకార సంస్థ జేఎండీ శైలజ, జీఎం ప్ర‌భంజన్ రావుతో పాటు ప‌లువురు వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

More Articles