Sunday, May 19, 2024

భోజనం తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!!

spot_img

మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే నిద్రిస్తుంటారు. దీంతో తిన్న ఆహారం జీర్ణం కాకుండా..బరువు పెరుగుతారు. శరీరానికి అందాల్సిన పోషకాలేవీ అందవు. భోజనం తర్వాత చేసే తప్పు ఇదొక్కటే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత ఎలాంటి తప్పులు చేకూడదో తెలుసుకుందాం. అలాంటి తప్పులు చేస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది…ఆరోగ్య నిఫుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం.

1. రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటం:
రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. కానీ భోజనం సమయంలో ఎక్కువ నీళ్లు తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది జీర్ణ స్రావాలను పలుచన చేస్తుంది. ఆహారం జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాదు శరీరంలో టాక్సిన్లు విపరీతంగా పెరుగుతాయి. భోజనం తర్వాత కనీసం రెండు గంటల పాటు చల్లటి నీటిని తాగకుండా ఉండం మంచిది.

2. టీ, కాఫీలు తాగకూడదు:
కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ కానీ కాఫీ కానీ తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది మీ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. వేడి వేడి ద్రవాలు మీ కడుపును యాక్టివ్ ఉంచుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ తిన్న వెంటనే వేడి వేడి పానీయాలు తీసుకోవడం శరీరానికి మరింత హాని చేస్తుంది.

3. స్నానం:
కొంతమంది స్నానం చేసిన వెంటనే భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు మెదడు మత్తుగా ఉంటుంది.

4. పండ్లు:
చాలామంది భోజనం చేసే సమయంలో అరటి, మామిడి పండ్లను తింటుంటారు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. పండ్లు జీర్ణమయ్యే వేగం వేరుగా ఉంటుంది. ఈకారణంగానే భోజనం తర్వాత పండ్లను తినకూడదు. కనీసం రెండు గంటల సమయం తర్వాత తినడం మంచిది.

5. తిన్నవెంటనే పడుకోవడం:
మనలో చాలా మందికి తిన్నవెంటనే పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నడవడం మంచిది.

6. రాత్రి భోజనం తర్వాత నడక:
మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలపాటు నడవడం మంచిది. ఎందుకంటే ఇది జీర్ణక్రియ ప్రక్రియలను పెంచేందుకు, యాసిడ్ రిఫ్లెక్స్ ను నిరోధించడంలో సహాయపడుతుంది. కాబట్టి తిన్నతర్వాత 100అడుగులు నడవడం అలవాటు చేసుకోండి.

 

 

 

Latest News

More Articles