Monday, May 20, 2024

టీకాంగ్రెస్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్‌

spot_img

తెలంగాణ కాంగ్రెస్‌ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్‌ తప్పుకున్నారు. గత కొద్దీ నెలలుగా టీ కాంగ్రెస్ లో సీనియర్లకు రేవంత్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య నేరుగా మీడియా ముందుకు వచ్చి సీనియర్ నేతలు రేవంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే మాణిక్కం ఠాగూర్‌ ఫై కూడా విమర్శలు చేశారు. మాణిక్కం ఠాగూర్‌ రేవంత్ వర్గానికే సపోర్ట్ గా ఉంటున్నారని , సీనియర్ల మాటలను పట్టించుకోవడం లేదని, మా బాధలను అధిష్టానానికి తెలియ జేయడం లేదన్నారు.

ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్ తప్పుకున్నారు. దీంతో రేవంత్ వర్గానికి భారీ షాక్ తగిలినట్టైంది. ఇవాళ ( బుధవారం) అవగాహన సదస్సు జరిగిన  తర్వాత.. ఆయన టీ కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు అంటూ ఆఖరి మెసేజ్ పెట్టిన ఠాగూర్.. ఆ తర్వాత అన్ని గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయ్యారు. కానీ ఇంచార్జి పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.

Latest News

More Articles