Friday, May 10, 2024

మెగాస్టార్ కి షాక్.. గందరగోళంగా వాల్తేరు వీరయ్య మూవీ టాక్ ?

spot_img

మెగా ఫ్యాన్స్ కోసం మరో సంచలన వార్త సిద్ధమైపోయింది. ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న వాల్తేరు వీరయ్య మూవీకి తాజాగా సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తుంది. సర్టిఫికెట్ తో పాటు వీరయ్య టాక్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ టాక్ లీక్స్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో లోడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే మొన్న మెగాస్టార్ చెప్పినట్లుగా ఇది చాలా రొటీన్ అయినప్పటికీ వినోదాత్మకంగా ఉన్నట్టు సెన్సార్ సభ్యలు అభిప్రాయమాట.

క మరో ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ పార్ట్ ఆకట్టుకుంటుందని.. సెకండాఫ్‌లో రవితేజ ఎంటర్ అవ్వగానే సినిమా గతి మారిపోతుందని.. దాదాపు మాస్ మహారాజ ఉన్న 40 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఇక సెకండాఫ్‌లో చిరంజీవి, రవితేజల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయని.. రెండు పాటల పిక్చరైజేషన్ సూపర్ అని టాక్. ఇక ఫైనల్ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఇది కొత్తదనం లేని రొటీన్ సినిమా అయినప్పటికీ సంక్రాంతి సీజన్‌ కాబట్టి గట్టెక్కొచ్చని అంటున్నారు. రవితేజ ఎపిసోడ్ జనాలకు కనెక్ట్ అయితే ఇది పక్క హిట్ అవుతుందని అంటున్నారు.

Latest News

More Articles