Monday, May 20, 2024

పుష్ప చిత్రంపై ఫాహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు..నాకు ఒరిగిందేమీ లేదు.!

spot_img

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమా పుష్ప ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పై యావత్ ప్రపంచం దృష్టిసారించింది. ఇప్పటికే పుష్ప 2 కు సంబంధించిన ఓ పాట యూట్యూబ్లో విడుదలై సంచలనంగా మారింది. అయితే తాజాగా పుష్ప సినిమాలో నటించిన ఫాహద్ ఫాజిల్ ఈ చిత్రంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఫాహద్ ఫాజిల్ పుష్ప చిత్రంలో షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాసేపు మెరిశారు. ఆయన పాత్రకు థియేటర్లో విజిల్స్ వినిపించాయి. అయితే మలయాళంలో హీరోగా మంచి విజయాలు అందుకున్న ఫాహద్ ఫాజిల్, ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉన్న పాత్రలు పోషిస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప చిత్రం వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదని. తన కెరీర్లో పుష్ప విజయం వల్ల కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేదని ఈ విషయాన్ని తాను డైరెక్టర్ సుకుమార్ ముందే కుండబద్దలు కొట్టి చెప్పానని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మలయాళం లోని ఫాహద్ అభిమానులు మాత్రం తమ హీరో చెప్పింది నిజమే అని ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు నటించిన ఫాహద్ కు పుష్ప వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏమీ లేదని నెట్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అయితే అటు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం. ఫాహద్ వ్యాఖ్యలపై కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంద. అంతర్జాతీయంగా అల్లు అర్జున్ పేరును అన్ని దేశాల్లో వినిపించేలా చేసిన పుష్ప చిత్రంపై మలయాళ నటుడు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. అయితే పుష్ప సీక్వెల్ సినిమాలో ఫాహద్ నట విశ్వరూపం చూస్తారని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులపై ఉత్తమ్ కీలక ప్రకటన.!

Latest News

More Articles