Monday, May 20, 2024

ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులపై ఉత్తమ్ కీలక ప్రకటన.!

spot_img

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కటికూడా సరిగ్గా అమలు చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పై ఎప్పటి నుంచో ప్రకటనలు చేస్తున్నప్పటికీ..ఆచరణ లో మాత్రం ముందుకు సాగడం లేదు. నియోజకవర్గాల్లో తిరుగుతున్న నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారంటూ మొహంమీదే తిట్టరాని తిట్లు తిడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులతో పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అంతే కాకుండా ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టానికి ఇప్పటికే నిధులు విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు.  ఇవన్నీ ఎప్పటి నుంచో చెబుతున్న మాటలనీ ఆచరణలో పెట్టి చూపించాలంటున్నారు ప్రజలు.

ఇది కూడా చదవండి: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి..!

Latest News

More Articles