Monday, May 20, 2024

కన్నప్ప మూవీ నుంచి క్రేజీ అప్ డేట్..ప్రభాస్ ఫొటో షేర్ చేసిన విష్ణు.!

spot_img

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు మంచు విష్ణు. ప్రభాస్ సెట్స్ లో కి అడుగుపెట్టారని తెలియజేస్తూ..ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో ప్రభాస్ ముఖాన్ని రివీల్ చేయలేదు విష్ణు. కాళ్లను మాత్రమే చూపించారు. శివ భక్తుడైన నందీశ్వరుడుగా ప్రభాస్ కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుందని ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్ననట్లు మంచు విష్ణు తెలిపారు.

ఇది కూడా చదవండి: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి..! 

Latest News

More Articles