Monday, May 20, 2024

ఫిదా బ్యూటీ బర్త్ డే..స్పెషల్ వీడియో విడుదల చేసిన తండేల్ టీమ్.!

spot_img

ప్రముఖ సినీనటి, ఫిదా బ్యూటీ సాయిపల్లవి పుట్టినరోజు నేడు. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది సాయిపల్లి. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తండేల్ సినిమా యూటిన్ బర్త్ డే విషెస్ తెలిపింది. సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. చందూ మొండేటి డైరెక్షన్ లో రూపొందిస్తున్న తండేల్ సినిమాలో నాగచైతన్యతో కలిసి సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ‘తండేల్’ టీమ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.

ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశాలతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా నటిస్తోంది. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్‌ సైన్యం చేతిలో బందీ అయిన భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు.. దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారులు చేసిన సాహసాలేమిటన్నదే ఈ సినిమా కథ.

ఇది కూడా చదవండి: అమెరికాలోని చికాగోలో మరో తెలంగాణ విద్యార్థి ఆచూకీ గల్లంతు..!!

 

Latest News

More Articles