Monday, May 20, 2024

పవన్ కల్యాణ్‎కే నా మద్దతు..అల్లు అర్జున్ పోస్ట్ వైరల్.!

spot_img

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ ను గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ విడియోను కూడా విడుదల చేశారు. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని అకాంక్షిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ట నేను చాలా గర్వంగా ఉన్నాను. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటటాయి. మీ ఆశ, ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నా అంటూ పేర్కొన్నారు. ఇక ఈమధ్యే నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కు మద్దతు తెలిపారు.

ఇది కూడా చదవండి:పుష్ప చిత్రంపై ఫాహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు..నాకు ఒరిగిందేమీ లేదు.!

Latest News

More Articles