Monday, May 20, 2024

800 కోట్లున్నా..క్రౌడ్‌ ఫండింగ్‌కు కాంగ్రెస్.. బ్లాక్ మనీని వైట్ చేసేందుకేనా?

spot_img

హైదరాబాద్‌: 138 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రూ.800 కోట్ల ఆస్తులున్నాయి. దేశంలో రెండో ధనిక పార్టీ అయిన కాంగ్రెస్‌ ఇటీవల తమ ఆదాయం 29 శాతం తగ్గిపోయిందని చెబుతోంది. దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌ ఇప్పుడు దేశ ప్రజలను చందాలు అడగడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ను ఆర్థికంగా పరిపుష్టం చేయాలని క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టినట్టు ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌ తాజాగా ప్రకటించారు.

Also Read.. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్..అరెస్ట్ తర్వాత ఎక్కడున్నాడో తెలుసా?

కాంగ్రెస్‌ తాజాగా చందాలడగడానికి గల కారణాలపై రాజకీయ పరిశీలకులు భిన్నంగా స్పందిస్తున్నారు. బడా బాబుల బ్లాక్‌ మనీని వైట్‌ చేయడానికి లేదా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా నిధులు రాకుండా పెద్ద కంపెనీలను నియంత్రిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకు చెక్‌ పెట్టటానికి ఈ ఎత్తు వేశారని కొందరు చెబుతున్నారు. డబ్బులు లేవని సామాన్యుల సానుభూతి పొందేందుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహమని మరికొందరు విశ్లేషించారు. బీజేపీ వద్ద ఇప్పుడు 6 వేల కోట్లకు పైగా ధనం ఉందని, అదంతా బడా పారిశ్రామిక వేత్తల దగ్గర నుంచి వచ్చేందనని ప్రజలకు చెప్పి సానుభూతి పొందేందుకు కాంగ్రెస్‌ పెద్ద ఎత్తుగడ అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు.

Latest News

More Articles