Monday, May 20, 2024

జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పంటలకు క్రాప్ హాలిడే!

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి అధికారులకు సమాచారం చేరినట్లు తెలుస్తోంది. త్వరలోనే రైతులకు ఈ విషయాన్ని అధికారులు వెల్లడించనున్నారు.

Also Read.. గజగజ వణుకుతున్న ఉత్తర తెలంగాణ

తాగునీటి అవసరాల నేపథ్యంలో సాగునీటికి కష్టాలు ఏర్పడుతాయని ముందస్తుగా పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల కుడి, ఎడమ కాలువల కింద సుమారు లక్ష ఎకరాలకు పంట విరామం రానుంది. 2018 తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఎగువ నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.

Latest News

More Articles