Sunday, May 19, 2024

మాన్యవర్ దుస్తుల సంస్థ యాడ్ లో రామ్ చరణ్

spot_img

టాలీవుడ్ సినీ నటుడు రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు, బ్రాండింగ్ లోనూ దూసుకెళ్తున్నాడు. రామ్ చరణ్ ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. తాజాగా ఆయన ఖాతాలో మరో యాడ్ చేరింది. రామ్ చరణ్ ప్రముఖ దుస్తుల సంస్థ మాన్యవర్ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఈ యాడ్ హిందీలో షూట్ చేశారు. అంటే, ఇది జాతీయ స్థాయిలో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ మీషో యాప్ కోసం చేసిన యాడ్ ఫిలింకు కూడా విశేష స్పందన వచ్చింది.

ఇది కూడా చదవండి: మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు న‌మోదు

మాన్యవర్ యాడ్ తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని మాన్యవార్ దుస్తులతో చాటిచెప్పే కాన్సెప్టుతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ‘మనల్ని ప్రేమించేవారిని మనకన్నా అధికంగా ప్రేమించాలన్నది మా నాన్న నుంచి అలవర్చుకున్నాను… జీవితంలో నిలదొక్కుకోవడం నాన్న నుంచి నేర్చుకున్నాను’ అనే డైలాగ్ తో రామ్ చరణ్ ఈ యాడ్ నటించాడు.

 

Latest News

More Articles