Saturday, May 18, 2024

తెలంగాణలో హీట్‌వేవ్స్‌.. వాతావరణశాఖ హెచ్చరికలు

spot_img

దేశంలో మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. జూన్‌ మాసం సగం గడిచిపోయినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రాగల మూడు రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వేడిగాలుల నేపథ్యంలో బిహార్‌లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.

అయితే విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వచ్చే మూడు రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో రానున్న 24 గంటలపాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. మరో వైపు బిహార్‌లో హీట్‌వేవ్ గత 11 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు 2012లో 19 రోజుల పాటు నిరంతరంగా వేడిగాలులు వీచాయి. ఈ సారి 20 రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి.

Latest News

More Articles