Monday, May 20, 2024

రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తు గడువు పెంచడం లేదు

spot_img

బీసీ కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువును పెంచడం లేదని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. ఇవాళ(మంగళవారం) వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు జులై 15వ తేదీన చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించి ప్రస్తుతానికి గడువు ముగిసినప్పటికీ… తిరిగి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. రెండో విడత దరఖాస్తుల కోసం మరో గడువు తేదీ ఉంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Latest News

More Articles