Sunday, May 12, 2024

కేసీఆర్ గొంతులో పాణం ఉన్నంత కాలం అది జరుగదు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్

spot_img

హుస్నాబాద్ : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై హుస్నాబాద్ లో మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్ గొంతులో పాణం ఉన్నంత కాలం బోరు బాయి కాడ మీటర్ పెట్టా అన్నడని తెలిపారు. నిర్మలా సీతారామన్ బీజేపీ కుట్రలను  బయటపెట్టారని, బిజెపికి ఒక్క సీటు కూడా రాదని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ కు మద్దతుగా అక్కన్నపేట్ లో మంత్రి హరీశ్ రావు రోడ్ షో నిర్వహించారు.

తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు. మోటార్లకు మీటర్లు అని బిజెపి, మూడు గంటలు అని కాంగ్రెస్ అంటున్నది. ప్రజలు ఎటువైపు ఉంటారు తేల్చుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. మాటలు చెప్పే వారు ఎవరు…. చేతలతో పని చేసే వారు ఎవరు ఆలోచన చేయాలి. కరీంనగర్ లో మూడు సార్లు ఓడకోడితే హుస్నాబాద్ కు వచ్చాడు కాంగ్రెస్ ఆయన. మాటల మనిషి కావాలా…. చేతల మనిషి కావాలా అని ప్రశ్నించారు.

గౌరవేల్లి ప్రాజెక్టు నీళ్లు తెచ్చింది మన ఎమ్మెల్యే సతీష్ బాబు. మన బీఆర్ఎస్ పార్టీ. గోరవేల్లి ప్రాజెక్టు ను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పెన్షన్ లు పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం.మీ పెన్షన్ 5 వేలు అవుతుంది. మళ్ళీ అధికారంలోకి రాగానే అమలు చేస్తాం.సంపద పెంచాడు కేసీఆర్ పేదలకు పంచాడు మన కేసీఆర్ అని తెలిపారు. కల్యాణ లక్ష్మీ,గృహ లక్ష్మీ ఇచ్చారు ఈసారి కొత్తగా సౌభాగ్య లక్ష్మీ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు 3000 ఇస్తామన్నారు.

ఈ సారి గెలువగానే రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇచ్చి 400 కె సిలిండర్ ఇస్తాం. ప్రతి రేషన్ కార్డుదారునికి సన్న బియ్యం ఇస్తాం. కారు కు ఓటు వేసి గెలిపించండి కొత్త సంవత్సరం నుండి సన్న బియ్యం ఇస్తాం. కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్,రైతు బంధు పథకాలను కాఫీ కొట్టారు అందులో మన రామక్క పాట కూడా కాఫీ కొట్టారు. ఆరు గ్యారెంటీ లు అని పెట్టారని తెలిపారు.

కర్ణాటకలో ఇవ్వే గ్యారెంటీ లు అని అక్కడ ప్రజలను మోసం చేశారు. గ్యారెంటీ లతో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి ఉదరగొట్టారు. ఏమైంది ఇప్పుడు గ్యారెంటీలు గాలికి వదిలేశారు అంట. పిల్లల స్కాలరషీప్ లు లేవు, రైతు బంధు 4 వేలు ఇచ్చేవారు అంట ఇప్పుడు అది లేదు. కరెంట్ కూడా అప్పుడు 7 గంటల ఇస్తుంటే ఇప్పుడు 3 గంటల కూడా ఇవ్వవడం లేదు. స్వయంగా అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చి తాము 5 గంటల కరెంట్ ఇస్తున్నాం మా రాష్ట్రంలో అని ఇక్కడే చెప్పాడని గుర్తుచేశారు.

Latest News

More Articles