Saturday, May 18, 2024

కేసీఆర్‎ను భారీ మెజారిటీతో గెలిపిస్తే.. ఒప్పించే బాధ్యత నాది

spot_img

గజ్వేల్‌లో కేసీఆర్ పోటీ చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ గౌరవాన్ని, ప్రతిష్టను కేసీఆర్ పెంచారని ఆయన అన్నారు. మంగళవారం గజ్వేల్ ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

Read Also: 11 మంది సీఎంలు చేయలేని పని కేసీఆర్ చేసి చూపించారు.. సండ్ర వెంకట వీరయ్య

కేసీఆర్‌ గెలిచిచాక గజ్వేల్‌కు దవాఖాన వచ్చిందన్నారు. మొన్నటి దాకా గజ్వేల్‌కు గూడ్స్ రైలు వచ్చేదని, ఈ రోజు నుంచి ప్యాసింజర్ రైలు కూడా ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు వెచ్చించిందని హరీష్ రావు తెలిపారు. గజ్వేల్‌లో ఎక్కువ మెజారిటీతో కేసీఆర్‌ను గెలిపిస్తే.. కామారెడ్డి నుంచి కాకుండా.. గజ్వేల్ నుంచే ప్రాతినిధ్యం వహించాలని కేసీఆర్ సారును ఒప్పించే పూచీ నాదని హామీ ఇచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని, అందుకే కేసీఆర్‎ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు వైశ్య సంఘ ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేసిన మంత్రి హరీశ్ రావుకు అందజేశారు.

Latest News

More Articles