Saturday, May 4, 2024

వాళ్లే బీఆర్ఎస్ పార్టీ అసలైన సోల్జర్స్

spot_img

సోషల్ మీడియాలో‌ సెన్సేషన్ కోసం వచ్చినవి నమ్మొద్దని.. కళ్ళతో చూసినవే నమ్మాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ బూత్ కమిటీ నాయకులతో మన్నెగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు క్యామ మల్లేష్,మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: రూ. 1000లకే ఫోన్.. యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ‘బూత్ కమిటీ నాయకులే పార్టీకి అసలైన సోల్జర్స్. రాబోయే 35 రోజులు సీరియస్‎గా పని చేయాలి. తెలంగాణ రాష్ట్రం రాక ముందు.. వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి వివరించాలి. సోషల్ మీడియాలో‌ సెన్సేషన్ కోసం వచ్చినవి నమ్మొద్దు.. కళ్ళతో చూసినవి నమ్మాలి. కర్నాటకలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి‌ వచ్చిన తర్వాత ఐదు గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మూడు గంటల కరెంటు చాలంటున్నాడు. మరి మూడు గంటలు విద్యుత్ సరిపోతుందా? రైతుబంధు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్. మన పథకాన్ని కాంగ్రెస్ కాపీ కొట్టింది. ఇవాళ అధికారంలోకి వస్తే మన ముఖ్యమంత్రి పదహారువేలు ఇస్తాం అన్నారు. నకలు కొట్టి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మనం ఎకరాకు 16,000 ఇస్తున్న విషయాన్ని రైతులందరికీ చెప్పాలి. మహిళలు మెజార్టీగా ఇవాళ కేసీఆర్ వైపు చూపిస్తున్నారు. సర్వేలన్నింటిలో మహిళలు కేసీఆర్ వైపే ఉన్నారు. మహిళల కోసం.. బీఆర్ఎస్ అనేక కార్యక్రమలు చెపట్టింది. రూ. 400 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఇస్తాం.. ఈ విషయం మహిళలందరూ అందరితో చెప్పాలి. సన్న బియ్యం ఇవ్వడం వల్ల అదనంగా రూ. 1300 కోట్ల భారం ప్రభుత్వం మీద పడుతుంది అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నబియ్యం ఇద్దామన్నారు. సన్న బియ్యం ఇస్తామంటే జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. కేసీఆర్ బీమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే మనం రైతుబీమా తీసుకొచ్చాం, ఇప్పుడు కేసీఆర్ బీమాను కోటి కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు, ఇది జీవిత బీమా. గతంలో 75 రూపాయల పెన్షన్ ఉంటే మనం ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని 5000 రూపాయలు చేయబోతున్నాం’ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Read Also: పోలీసులమంటూ తనిఖీలు చేసి రూ. 18 లక్షలతో ఉడాయించిన కేటుగాళ్లు

Latest News

More Articles