Saturday, May 18, 2024

తెలంగాణ రాష్టం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుంది

spot_img

తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈ సారి ఎన్నికల్లో పోటీ జరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇవాళ(మంగళవారం) సంగారెడ్డిలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్..కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ బీఅర్ఎస్ పార్టీ. దేశంలోనీ అన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి… తెలంగాణలో మాత్రం కోతల్లేవు. సంగారెడ్డి లో ఈ సారి కచ్చితంగా BRS జెండా ఎగారేస్తామన్నారు.

మరోవైపు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధరణి కామెంట్లపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మా నాన్న కంప్యూటర్ తెచ్చారు అన్నారు..మేం కూడా ధరణిని కంప్యూటరీకరణ చెస్తే వద్దంటున్నారని అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ అంటొంది. ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనని అన్నారు. ధరణిని వ్యతిరేకిస్తే ప్రజలే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారని అన్నారు మంత్రి హరీష్ రావు.

ఇది కూడా చదవండి: ప్రజలకు మంచి చేసే వారికి  సమున్నత స్థానం కల్పించాలి

Latest News

More Articles