Sunday, May 19, 2024

డెవలప్‎మెంట్ కోసం ఎంతదూరమైనా వెళ్తా..

spot_img

సూర్యాపేట అభివృద్ధే తన అభిమతమని.. దేశం అబ్బురపడెలా డెవలప్‌ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తానని మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం సద్దుల చెరువు ట్యాంక్ బండ్ పై వాకింగ్ చేస్తూ మార్నింగ్ వాకర్స్‎తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేండ్లల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని మంచి చేస్తున్న బీఆర్‌ఎస్‌కు అండగా నిలబడాలని కోరారు. చెప్పిందే కాదు.. చెప్పని పనులను కూడా ఎన్నో చేశామన్నారు. సూర్యాపేట 2014 సంవత్సరానికి ముందు, తర్వాత ఎలా ఉందో ప్రజలు ఒకసారి మనస్సుపెట్టి ఆలోచించి చూడాలన్నారు. సూర్యాపేట దశదిశలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. 2014కు ముందు పట్టణవాసులు ఎదుర్కొన్న తాగు, సాగు నీరు, విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించానని తెలిపారు. అప్పుడు కంకర తేలిన పట్టణ రహదారులను అద్దంలో మెరిసిపోయేలా చేశానని తెలిపారు. అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చిన మంత్రి, మూడో దశ పాలనలో రాబోయే డ్రైపోర్టు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు సూర్యాపేట ఆర్థిక ముఖచిత్రమే మారబోతుందని తెలిపారు. మరోవైపు పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసి పదివేల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో టైగర్లమంటూ ప్రజల్లోకి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదమరిస్తే ముసలి పులి వెనుక ఉన్న తోడెళ్ళ పడినట్లే అవుతుందన్నారు.

మీ పాలనలోనే అభివృద్ధి చూశాం.. మా ప్రయాణం మీ వెంటే
గతంలో అభివృద్ధికి నోచుకోని సూర్యాపేటలో మీరు వచ్చిన తర్వాతనే మొదటిసారిగా అభివృద్ధి చూశామని బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డిని మార్నింగ్ వాకర్స్ కొనియాడారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని పదేళ్ల కాలంలో చేసి చూపించిన మీతోనే మా ప్రయాణం అంటూ మార్నింగ్ వాకర్స్ సంపూర్ణ మద్దతును తెలిపారు. సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి కాకుండా మరెవరినీ ఊహించుకోలేమన్నారు. జగదీశ్వర్ రెడ్డి వచ్చాకే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. పట్టణంలో గత 15 ఏండ్లుగా ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నామని తెలిపారు. మరోసారి జగదీష్ రెడ్డిని గెలిపిస్తే.. సూర్యాపేట అభివృద్ధి నెక్స్ట్ లెవెల్‎కు ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు కూడా మంత్రికి మద్దతుగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వార్నింగ్ వాకర్స్ పిలుపునిచ్చారు.

Read Also: జీతం అడిగినందుకు నోట్లో చెప్పులు పెట్టి చితక్కొట్టించిన యజమానురాలు

Latest News

More Articles