Saturday, May 18, 2024

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్

spot_img

సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. దళిత బంధు పథకంతో తమను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు సామాజిక గౌరవానికి భరోసా కల్పించిన బీఆర్ఎస్ పార్టీ, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డితోనే మా పయనం అంటూ పార్టీలో చేరుతున్నారు. ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కుటుంబాలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు.. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికిన మంత్రి.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఏ పార్టీల వల్ల తమ బతుకులు బాగుపడ్డాయో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 2014లో బీఆర్ఎస్‎కు వేసిన ఓటు 7500 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి కేవలం ఆరంభం మాత్రమేనన్న మంత్రి.. ఇంకా చేయవలసింది చాలా ఉందన్నారు. పార్టీలకతీతంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‎కు అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో
బచ్చలకూరి శేఖర్, ఇరుగు నవీన్, బచ్చలకూరి కరుణాకర్, బచ్చలకూరి అరవింద్, గుర్రాల రాంబాబుతో పాటు దళిత కుటుంబాలు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‎లో చేరారు.

Read Also: అత్తను గన్‎తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

Latest News

More Articles