Sunday, May 12, 2024

తాము ప్రతీకార రాజకీయాలు చేస్తే.. రేవంత్‌ జైల్లో ఉండేవాడు

spot_img

హైదరాబాద్‌: తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్‌ పాలన సాధించిన ఘనత కారణంగా.. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 14 వేలుగా ఉందని, ప్రస్తుతం అది రూ.3లక్షల 17 వేలకు పెరిగిందన్నారు.   సీఎం కేసీఆర్‌ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు. అప్పులు చేసిన నిధులు సంపద సృష్టికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చినట్లు చెప్పారు. 7.7 శాతం గ్రీన్‌ కవర్‌ పెంచడం దేశంలోనే అద్భుతమన్నారు.

Also Read.. తమ నాయకునికి సీటు ఇవ్వలేదని పెట్రోల్ పోసుకున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు

ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయని, బెంగళూరును హైదరాబాద్‌ దాటేసిందని చెప్పారు. అదే సమయంలో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని సోనియా హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. వందల మంది బలిదానాలు కారణం అయ్యారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు మైగ్రేషన్‌కు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు… ఈరోజు ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపుమాపిందని చెప్పారు.

Also Read.. ఈ ఆకు డయాబెటిక్ పేషంట్లకు వరం…రక్తంలో షుగర్‎ను తగ్గిస్తుంది..!

కాంగ్రెస్‌, బీజేపీలకు అభివృద్ధిపై విజన్‌ లేదని విమర్శించారు. తాము చేసిన పనులు చెప్పుకొని మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు,  పేదల ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. తాము ప్రతీకార రాజకీయాలు చేస్తే రేవంత్‌ ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడని చెప్పారు.

Latest News

More Articles