Sunday, May 19, 2024

కేసీఆర్ లక్కీ నంబర్ 6.. పోలింగ్, కౌంటింగ్ డేట్స్ కలిపితే 6.. విజయంపై కేటీఆర్ లెక్కలు అదుర్స్

spot_img

నేడు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 30న ఎన్నికలు ఉండనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..! రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..! మూడోసారి మనదే జయం..డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో ముచ్చటగా మూడోసారి గెలిచేది మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారే..! దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం. దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం..! పదేండ్ల ప్రగతి మా పాశు పతాస్త్రం..! విశ్వసనీయతే మా విజయ మంత్రం…! జన నీరాజనంతో గులాబీదే ప్రభంజనం..! ప్రతిఘాతుక ప్రతిపక్షాలకు తప్పదు మళ్లీ పరాభవం..!

ఇక కేసీఆర్ లక్కీ నంబర్ 6. పోలింగ్, కౌంటింగ్ నంబర్ కలిపితే కూడా ఆరు వస్తుంది. ఏ లెక్కన చూసినా కేసీఆర్ విజయం ఖాయం. మా కెప్టెన్ కేసీఆర్.. అందుకే మా టీంలో హుషారు. హ్యాట్రిక్ విక్టరీ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారు. మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకే ప్రజల ఓటు. ముంచే పార్టీలపై తప్పదు వేటు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. గులాబీ శ్రేణుల సమరోత్సహంతో కదం తొక్కుతోంది తెలంగాణ నేల. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు గుండె గుండెలో ఎగురుతోంది మన గులాబీ జెండా..! తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప ఈ గడ్డపై గాడ్సే రాద్దాంతం నడవదు..! 2014 లో తొలి అసెంబ్లీ ఎన్నికను నడిపించింది.. “ఉద్యమ చైతన్యం “. 2018 లో రెండో ఎన్నికను గెలిపించింది.. “సంక్షేమ సంబురం”. 2023 లో మూడో ఎన్నికను శాసించేది.. ముమ్మాటికీ… మన “పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం”. సమరానికి బీఆర్ఎస్ సర్వసన్నద్ధం. యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం. పోటీకి ముందే పూర్తిగా కాడి పడేసిన కమలం. బీఆర్ఎస్.. తన పాత రికార్డులు తిరగ రాయడం ఖాయం..! ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం..! బీఅర్ఎస్ తోనే తెలంగాణ చరిత కేసిఆర్ గారితోనే తెలంగాణకు భవిత. అద్భుత విజయం మనదే’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.

Latest News

More Articles