Saturday, May 18, 2024

బీజేపీకి 100.. కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరు

spot_img

హైదరాబాద్‌: మేనిఫెస్టో, తొమ్మిదేళ్ల పాలన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో వార్‌ రూమ్‌ల ఇన్‌ఛార్జిలతో మంత్రి హరీశ్ రావుతో కలిసి సమావేశం నిర్వహించారు.

Also Read.. షాద్ నగర్ లో కాంగ్రెస్ కి షాక్

ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూస పద్ధతులతో కాకుండా.. కొత్త తరహాలో ప్రజలకు చేరువ కావాలని చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా కొత్త ఓటర్లకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.

Also Read.. మైనంపల్లిని చిత్తుగా ఓడిస్తా.. నక్క రాజశేఖర్ గౌడ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని కేటీఆర్‌ అన్నారు. బీజేపీకి 100.. కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలు తమతోనే ఉన్నారని, గతం కన్నా మెరుగైన ఫలితాలతో ఘన విజయం సాదిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వే రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

Latest News

More Articles