Saturday, May 18, 2024

ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు కిషన్ రెడ్డి

spot_img

ప్రగతిభవన్లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ‘అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నది. 90 స్థానాలకు పైగా గెలుస్తాం, కెసిఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి.

తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బిజెపి అడగదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తుందా చెప్పాలి. 55 సంవత్సరాలలో 200 దాటి పెన్షన్ ఇవ్వని వారు…. నాలుగు వేలు ఇష్టం అంటే ఎట్లా నమ్ముతారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి చెప్పిన, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పాత చరిత్ర తెలుసు. పాలమూరు ప్రాజెక్టు పైన కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఈరోజు ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయి.

ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు కిషన్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితా ఆని కలలు కంటే ఎవరు పట్టించుకుంటారు. దేశంలో మోడీని మా పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ అయినా విమర్శ చేసిందా. కాంగ్రెస్ పార్టీ బిజెపి అవగాహనలో ఉన్నాయి. అందుకే బిజెపిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించరు. మా నాయకుల పైన దాడులు చేసిన ఈడి ఒక్క కాంగ్రెస్ నాయకుడి పైన కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేసినాయా’ అని అన్నారు కేటీఆర్.

 

Latest News

More Articles