Sunday, May 19, 2024

ప్రతిపక్షాల కొట్టే డైలాగులను చూసి మోసపోవద్దు.. పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి

spot_img

హైద‌రాబాద్ : బేగంపేట ధనియాల గుట్టలోని శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌ వద్ద 4 ఎకరాల్లో రూ. 8.54 కోట్లతో నిర్మించిన‌ వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ వైకుంఠధామ నిర్మాణంలో అనేక ఇబ్బందులు వచ్చాయని, వాటిని ఎదుర్కొని మంచి స్మశాన వాటిక నిర్మాణం చేశామన్నారు. ఎల్బీనగర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల కోసం ఒకేచోట స్మశాన వాటిక ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

‘‘హైదరాబాదు నగరం విశ్వ నగరంగా ఎదగాలి అంటే బాడీ ఫ్లై ఓవర్లు, మెట్రోలాంటి సౌకర్యాలు, మంచినీళ్లతోపాటు మంచి స్మశాన వాటికలు కూడా అవసరం. గడిచిన 9 ఏళ్లలో హైదరాబాద్ నగరం మనందరం గర్వపడే విధంగా మారింది. హైదరాబాద్ అభివృద్ధి పైన సూపర్ స్టార్ రజనీకాంత్, సినిమా హీరోయిన్ లయలు ఇటీవల ప్రశంసలు కురిపించారు.

హైదరాబాద్ నగరంలో సమస్యలు ఉన్నాయి. అయితే వాటి పరిష్కారం కోసం ఎలా కృషి చేస్తున్నాం అనేది ముఖ్యం. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం దృష్టి పెట్టి పనిచేస్తుంది. అందులో కొన్నింటిలో చాలా పురోగతి ఉంది. ప్రజల అవసరాలు తీర్చే విధంగా మన పనుల ఉండాలని ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మేము ముందుకు వెళ్తున్నాం.

హైదరాబాద్ లో నాలాల అభివృద్ధికి 985 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 9 ఏళ్లలో మంచినీళ్లు వచ్చాయి. రోడ్లు బాగా అయ్యాయి. ఫ్లైఓవర్లు పూర్తి అవుతున్నాయి. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టాము. నాలుగు నెలల్లో వాటిని ఇస్తాము.

ప్రజారవాణాను మెరుగుపరుస్తాం. ఎయిర్పోర్ట్ మెట్రో పనులు చేపడుతున్నాం. ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ కమిట్మెంట్ను మీరు గుర్తు ఉంచుకోవాలని కోరుతున్నాం. నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదు ఆ మాటలు మాకు రావా.

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా సాయం చేసిందా. హైదరాబాద్ అభివృద్ధి జరుగుతున్న కళ్ళు న్న కబోదుల్లా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం.

ఐటి రంగం, ఇండస్ట్రీ రంగంలో పెట్టుబడులు భారీగా రావడానికి రాజకీయంగా తెలంగాణ స్థిరత్వంగా ఉండడం కూడా కారణం. మంచి ప్రభుత్వం, కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం కారణంగా మౌలిక వసతులపై ప్రభుత్వం పని చేస్తుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చాలా పనులు చేసాం.. కాబట్టే దేశస్థాయిలో చాలా అవార్డులు మనకు వస్తున్నాయి. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. వాటిని కూడా చేస్తాం.

మంచి నాయకులు, మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు.. ప్రతిపక్షాల కొట్టే డైలాగులను చూసి మోసపోవద్దు అని కోరుతున్నా. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి.’’ అని కేటీఆర్ కోరారు.

Latest News

More Articles