Sunday, May 19, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నాం

spot_img

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. మన ఇంటి అమ్మాయిని వేరే ఇంటికి ఇవ్వాలంటే పది సార్లు ఆలోచిస్తాం..ఇంత గొప్పగా సాధించుకున్న రాష్ట్రం, అభివృద్ధి చేసుకున్న రాష్ట్రం ఎవరు చేతిలో ఉండాలో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్,హరీష్ రావు ,జగదీష్ రెడ్డి ల సమక్షం లో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు చెరుకు సుధాకర్. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చెందింది. 46 రోజుల పాటు కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, జైలు శిక్ష అనుభవించిన చెరుకు సుధాకర్ సహా, జిట్టా బాలకృష్ణ, ఏపురు సోమన్న, హర్ దీప్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో చేరడం గొప్ప విషయం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నాం.ఆలోచించి  ఓటు వేయండి ..కేసీఆర్ కు హ్యాట్రిక్ సీఎం గా అవకాశమివ్వండన్నారు.

అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్..ఈ సారి దసరా కు ఊర్లలో అభివృద్ధి చర్చ జరగాలన్నారు.

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల డిఎన్ఎ మ్యాచ్ కావడం లేదు

 

Latest News

More Articles