Monday, May 20, 2024

మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్.. మాది 24 గంటల పవర్‎ఫుల్ మోడల్

spot_img

తెలంగాణలో ఎన్నికల జోరు ఊపుమీదుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎలక్షన్ ప్రచారమే కనిపిస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుకు రెండు, మూడు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ కర్ణాటక సీఎంను తీసుకొచ్చి తెలంగాణలో ప్రచారం చేయించింది. దీనిపై బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీది కర్ణాటకలో ఫెయిల్యూర్ మోడల్ అయితే.. మాది తెలంగాణలో పవర్ ఫుల్ మోడల్ అని చురకంటించారు. కాంగ్రెస్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

Read Also: హైదరాబాద్‎లో క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం

‘సిద్ధరామయ్య గారు.. కర్ణాటకలో మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్.. తెలంగాణలో మాది 24 గంటల పవర్ ఫుల్ మోడల్. పదేళ్ల ప్రస్థానం తరువాత కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన మాది. అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే… తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీది. మీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలకు పాతరేసి, నమ్మి ఓటేసిన ఆ ప్రజలను పూర్తిగా గాలికొదిలేసి.. ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదు.. తెలివైన తెలంగాణ. రైతులకు ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని మీరు.. మీ ప్రజలకిచ్చిన ఐదు హామీల్ని ఐదేళ్లయినా అమలుచేయలేరు. మీ రాష్ట్రంలో కనీసం రేషన్ ఇవ్వలేరు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే.. ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే.. వైఫల్యాల కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధం..! నమ్మి మోసం చేసినందుకు మీకు సరైన గుణపాఠం చెప్పడం తథ్యం..!!’ అని ట్వీట్ చేశారు.

Latest News

More Articles