Friday, May 10, 2024

వాహనదారులకు అలర్ట్.. నేడు హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

spot_img

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు నగరానికి రానున్నారు. దాంతో హైదరాబాద్‎లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎లో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అందులో భాగంగా సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్‎కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్స్‎కు చేరుకుంటారు. మోడీ ఈ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా.. ప్రధాని మోడీ టూర్ పర్యటన దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరేడ్‌ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కాబట్టి ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్గాల్లో కాకుండా.. తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

  • సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనాలను వైఎంసీఏ నుంచి క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ ప్యారడైజ్‌, సీటీఓ, రసూల్‌పుర నుంచి బేగంపేటకు వెళ్లాలి.
  • బేగంపేట నుంచి సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌ వైపు వెళ్లే వాహనదారులు సీటీఓ ఎక్స్‌ రోడ్స్‌ వద్ద బాలమ్‌ రాయ్‌, బ్రూక్‌బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్సన్‌ రోటరీ మీదుగా వెళ్లాలి.
  • బోయిన్‌పల్లి, తాడ్‌బన్‌ నుంచి టివోలి వైపు వెళ్లే వాహనాలను బ్రూక్‌ బాండ్‌ వద్ద నుంచి సీటీఓ, రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.
  • కార్ఖానా, జేబీఎస్‌ నుంచి ఎస్‌బీఐ ప్యాట్నీ వైపు స్వీకార్‌ ఉపకార్‌ నుంచి వైఎంసీఏ, క్లాక్‌ టవర్‌ మీదుగా వెళ్లాలి.
  • ప్యాట్నీ నుంచి ఎస్‌బీఐ‌, స్వీకార్‌ ఉపకార్‌ వైపు వాహనాలను అనుమతించరు. క్లాక్‌ టవర్స్‌ వద్ద నుంచి వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.
  • తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ఫ్లాజా వైపు వెళ్లే వాహనాలను తివోలి వద్ద నుంచి స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.
  • జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేట వెళ్లే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్‌, గ్రీన్‌లాండ్‌, రాజ్‌భవన్‌ వైపు మళ్లిస్తారు.

Latest News

More Articles