Sunday, April 28, 2024

మూడు రోజుల చిన్నారికి హార్ట్ ఆపరేషన్

spot_img

మూడు రోజుల చిన్నారికి గుండె ఆపరేషన్ చేసి హైదరాబాద్ వైద్యులు చరిత్ర సృష్టించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మూడు రోజుల శిశువు గుండెకు రెండు రకాల సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో వారు సికింద్రాబాద్‌ కిమ్స్‌ వైద్యులను సంప్రదించారు. ఈ శిశువుకు ట్రాన్స్‌పోజిషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ ఆర్టెరీస్‌ (టీజీఏ) టోటల్‌ ఎనామలస్‌ పల్మనరీ వీనస్‌ కనెక్షన్‌ (టీఏపీవీసీ) అనే రెండు రకాల తీవ్రమైన సమస్యలు గుండెలో ఏర్పడ్డాయని సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిక్‌ కార్డియోథోరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ధర్మవరం తెలిపారు. ఇలా రెండు రకాల సమస్యలు ఒకరిలోనే ఉండటం ప్రపంచ వైద్య చరిత్రలో మొదటిసారి అని అన్నారు. టీఏపీవీసీ సమస్యకు సంబంధించి ఊపిరితిత్తుల రక్తనాళాన్ని తీసి సరైన చోట పెట్టామని, మూడు రోజుల శిశువుకు ఇలాంటి చికిత్స చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు.

Read Also: వాహనదారులకు అలర్ట్.. నేడు హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

Latest News

More Articles