Saturday, May 11, 2024

జీమెయిల్‌ వాడేవారికి అలర్ట్‌.. అలా చేస్తే అకౌంట్లను డిలీట్‌ చేస్తామని గూగుల్‌ వార్నింగ్‌

spot_img

జీమెయిల్‌ ఖాతాదారులకు గూగుల్‌ వార్నింగ్‌ ఇచ్చింది. కనీసం రెండేండ్ల నుంచి ఎలాంటి యాక్టివిటీ లేకుండా నిరుపయోగంగా ఉన్న లక్షల జీమెయిల్‌ ఖాతాలను డిలీట్‌ చేయనున్నట్టు మే నెలలోనే హెచ్చరించిన గూగుల్‌.. వచ్చే నెల నుంచి దశలవారీగా ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఖాతాల తొలగింపునకు ముందు వాటి యూజర్లకు కొన్ని నెలలపాటు హెచ్చరికలు పంపుతామని, తొలగింపునకు గురయ్యే ఖాతాతోపాటు రికవరీ మెయిల్‌కు కూడా ఈ సందేశం వస్తుందని తెలిపింది. కనీసం రెండేండ్ల నుంచి వినియోగించకుండా, లాగిన్‌ కాకుండా ఉన్న జీమెయిల్‌ ఖాతాలతోపాటు వాటికి అనుసంధానమై ఉన్న డాక్స్‌, డ్రైవ్‌, మీట్‌, క్యాలెండర్‌, గూగుల్‌ ఫొటోస్‌లోని కంటెంట్‌ను సైతం తొలగించనున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది.

Read Also: మూడు రోజుల చిన్నారికి హార్ట్ ఆపరేషన్

Latest News

More Articles