Saturday, May 18, 2024

కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ అద్భుతం

spot_img

మహబూబ్ నగర్ సమీపంలో ఉన్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లో 26వేల ఎకరాలలో జంగిల్ సఫారని చేపట్టడం అద్భుతం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిపాలన, పరిశ్రమల శాఖ మంత్రి కే .తారక రామారావు అన్నారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఆనుకుని ఇంత భారీ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండడం స్థానికుల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అర్బన్ పార్కులో కొద్ది దూరం ప్రయాణించాక వర్షం ప్రారంభమైంది. జోరు వానను కూడా లెక్కచేయకుండా మంత్రులు దట్టమైన అడవిలో ఉన్న గోల్ బంగ్లా దిశగా ప్రయాణించారు. అద్దాలు, కిటికీలు లేని జంగిల్ సఫారీ వాహనాలకు వర్షం తాకిడి వల్ల మంత్రులు పూర్తిగా తడిసిపోయారు.

అయినప్పటికీ అడవిలో వారి ప్రయాణం కొనసాగింది. హైవే నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో నూతనంగా నిర్మించిన గోల్ బంగ్లాను చేరుకుని ప్రారంభించి వాచ్ టవర్ ఎక్కి అక్కడి నుంచి అటవీ అందాలను తిలకించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన గోల్ బంగ్లా కూలిపోగా దాని స్థానంలో పునరుద్ధరించిన గోల్ బంగ్లాను సందర్శించి అక్కడ మ్యాప్ ద్వారా 26వేల అటవీ విస్తీర్ణాన్ని తిలకించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లను కూడా ఇక్కడి నుంచి పరిశీలించారు. భవిష్యత్తులో కెసిఆర్ ఎకో పార్కు పర్యాటకులకు అద్భుతంగా తయారవుతుందని అన్నారు.

Latest News

More Articles