Friday, May 17, 2024

ఖమ్మం గడ్డపై మంత్రి కేటీఆర్.. రూ.1369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

spot_img

హైదరాబాద్: ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు మంత్రులు కేటీఆర్,  వేముల ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి అంజనాపురం సమీపంలో 250 కోట్ల రూపాయలతో గోద్రెజ్ వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం నియోజకవర్గం లో 1369 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు.

Also Read.. దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి అండగా కేటీఆర్

అలాగే ఖమ్మంలో 690 కోట్లతో మున్నేరు రివర్ ఫ్రంట్,  180 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జ్ , 250 కోట్ల రూపాయలతో ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. 106 కోట్ల రూపాయలతో గోళ్లపాడు ఛానల్ పై అభివృద్ధి చేసిన పది పార్కులు,  వాకింగ్ ట్రాకులు,  క్రీడా ప్రాంగణాలను ప్రజలకు అంకితం చేయనున్నారు.

Also Read.. నిరుద్యోగులకు అలర్ట్…600 పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు..!!

భద్రాచలం పట్టణానికి 38.45 కోట్లతో వరద ముంపును శాశ్వతంగా నివారిస్తూ కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన, ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 14.5 కోట్లతో భద్రాచలంలో సెంట్రల్ లైటింగ్,  వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ , నగరం లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, సత్తుపల్లి మున్సిపాలిటీలో 128 కోట్ల రూపాయలతో షాదీ ఖానా క్రిస్టియన్ భవన్,  చాకలి ఐలమ్మ ఘాట్,  స్టేడియం , డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియం లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సత్తుపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Latest News

More Articles