Sunday, May 19, 2024

కాంగ్రెస్ ను నమ్ముకుంటే కష్ట కాలం తప్ప ఒరిగేది ఏమి లేదు

spot_img

నా గెలుపు నాది కాదు శ్రమజీవులు, రైతన్నలు, ప్రజల గెలుపని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సాగునీళ్లు తెచ్చి బతుకు దెరువుకు బాటలు వేశాను..నేను మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని రేపటి భవిష్యత్తు, బతుకు దెరువు కోసమేనని అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి, మణిగిళ్ల, మోజర్ల, మదిగట్ల, అమ్మపల్లి, ఆల్వాల, చిన్న మందడి, దొడగుంట పల్లి, అంకాయ పల్లి తండా గ్రామాల్లో మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాట్లాడిన మంత్రి..కాలువలు తవ్వించి నియోజకవర్గానికి సాగునీళ్లు తీసుకుని వచ్చాను. రేపటి భవిష్యత్తు మొత్తం వ్యవసాయం రంగం మీదనే ఆధారపడి ఉంటుంది… ముందు చూపుతో వ్యవసాయ ఆదారిత పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రైతుల పొలాలకు వెళ్లేందుకు కూడా బాటలు వేయడం జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిపిస్తే సీఎం కేసీఆర్ నన్ను వ్యవసాయ శాఖ మంత్రిని చేయడంతో కష్టపడి పనిచేసి వ్యవసాయానికి వన్నె తెచ్చాను .. వనపర్తి పేరును నిలబెట్టాను. ప్రజలకు, రైతులకు మంచి జరగాలి అనుకున్నవారందరు మన వెంబడి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు.

కాంగ్రెస్ వాళ్లు వాళ్ల హయాంలో రైతులకు ప్రజలకు కరెంట్ కష్టాలు మాత్రమే ఇచ్చారు, భవిష్యత్తు లో కూడా కాంగ్రెస్ వస్తే రాష్ట్రం పరిస్థితి, ప్రజల జీవితాల పరిస్థితి ఆగం అవుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ రైతు బీమా తరహాలో వాళ్లకు కేసీఆర్ బీమాను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కష్ట కాలం తప్ప.. ఒరిగేది ఏమి లేదు. సాగునీళ్లు ఇవ్వడం వల్ల రాష్టంలో 2.5 కోట్ల మందికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఉపాధి దొరుకుతుంది

నేను గెలిస్తే మీరు గెలిచినట్లే .. ఓటు వేసే ముందు ఒకసారి  మీరే ఆలోచించుకోవాలన్నారు.సరైన నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి ముందుకు సాగడానికి  వీలుగా ఉంటుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను మూడేళ్లలో పూర్తయ్యేది. కానీ పని జరుగకుండా 1000 కోట్ల జరిమానాతో కోర్టులో కేసు వేశారు. అయినా మొండిగా పని చేసి 7.5 సంవత్సరాలలో పాలమూర్ రంగారెడ్డి పనులు పూర్తి చేశామని తెలిపారు. 1కోటి 10 లక్షల ఎకరాల్లో యాసంగి, రబి సీజన్ లో వరి పంటను పండిస్తూ దేశానికి అన్నం పెట్టే పరిస్థితి కి వచ్చామన్నారు.

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు, అరాచక పాలన

Latest News

More Articles