Monday, May 20, 2024

వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలి

spot_img

హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న, సాగునీటి శాఖ ఎస్ ఈ శ్రీనివాస్, విత్తన సంస్థ ఎండీ కేశవులు, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ,ఉద్యాన శాఖ జేడీ సరోజిని తదితరులు పాల్గొన్న ఈ సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..

‘వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలి. ఈ వానాకాలంలో సాగు చేయాల్సిన పంటల వివరాలు రైతులకు వ్యవసాయ శాఖ అందజేయాలి. వరిలో కూనారం సన్నాలు , కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ ఎన్ ఆర్ 21278, ఆర్ ఎన్ ఆర్ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా , ఎం టి యూ 1010 , జగిత్యాల 24423, ఐ ఆర్ 64, హెచ్ ఎం టి సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలను మాత్రమే సాగు చేయాలి. ఈ నెలలో రాబోయే మూడు రోజులు, జులై 2వ వారం నుండి మరియు ఆగస్టు చివరి వరకు సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు ఆలస్యం అయినందున క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలి. రైతువేదికలలో నిరంతరాయంగా రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. విత్తనాల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు ఉంటాయి’ అని అన్నారు నిరంజన్ రెడ్డి.

Latest News

More Articles