Monday, May 13, 2024

కాంగ్రెస్ గ్యారంటీలకు గ్యారంటీ లేదు

spot_img

వనపర్తి జిల్లా : కాంగ్రెస్ గ్యారంటీలకు గ్యారంటీ లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూర్ జిల్లాలో గులాబీ జెండా మొదలుపెట్టిందే రంగాపురం నుండని, ఇక్కడి నుండి విస్తరించి రాష్టం మొత్తం అయిందని గుర్తుచేశారు.  పెబ్బేరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కట్టిన రైసుమిల్లును అమ్మి, మంచి న్యాయవాదిగా ఉండి హైకోర్టు జడ్జి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ కోసం జెండా పట్టి ఉద్యమం చేసినట్లు పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా సిఎం కేసిఆర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. ఓడిపోయినా కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మంచి పనులు చేయడంతో వనపర్తి చరిత్ర లోనే భారీ మెజారిటీ ని వనపర్తి ప్రజలు అందిస్తే .. ముఖ్యమంత్రి తనను వ్యవసాయ శాఖ మంత్రిని చేసారని తెలిపారు. ఉచితంగా వ్యవసాయానికి కరెంట్, రైతుబంధుతో పంటలపెట్టుబడి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పక్షాన నిలబడింది రాష్ట్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు.

కండ్ల ముందు ఉన్న అభివృద్ధి, వసతులు, సంక్షేమ పథకాలు,  అన్ని పది ఏండ్ల కింద లేవు..  ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని, సిఎం కేసిఆర్ ను ఆశీర్వదించి మరోసారి ఇవ్వాలి. అబద్దాలు చెప్పడంలో  ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు సిద్ద హస్తులన్నారు. 24 గంటల కరెంట్, పాఠశాలలు పెట్టి ఉదయం, మధ్యాహ్నం భోజనం, రైతు పెట్టుబడి, రైతు బీమా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కెసిఆర్ ను మరోసారి ఆదరించాలని కోరారు.

మొదటి దపాలో 17 వేల కోట్ల రుణ మాఫీ చేసినం, రెండవ విడత 19 వేల కోట్ల రుణమాఫీ లో 15 వేల కోట్ల రుణమాపి చేయగా 4 వేల కోట్ల రుణమాపీ ఎన్నికల తరువాత మాఫీ అవుతుంది. 4.5 లక్షల కోట్లు వ్యవసాయం రంగం మీద తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది.  భారతదేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ మెదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు.

Latest News

More Articles