Friday, May 17, 2024

గ్రామాలకు చెరువులు గుండె కాయ.. పనికిమాలిన విపక్ష పార్టీలు కడుపునొప్పితో విమర్శలు చేస్తుండ్రు

spot_img

ఖమ్మం జిల్లా: ఖమ్మం చెరువుల పండగ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరులో చెరువుల పండుగ ఘనంగా  జరుగుతుందన్నారు. చెరువుల మీద మన జీవనం ఆధారపడి ఉంటుందని,  గ్రామాలకు చెరువులు గుండె కాయ అని తెలిపారు.

గొలుసు కట్టు చెరువు ద్వారా కాకతీయ రాజులు నీటి చుక్క వృధా కాకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాకతీయ రాజుల స్ఫూర్తితో 30 వేల కోట్లతో చెరువులను పునరుద్ధరించాం. 60, 70 టీఎంసీల నీటిని చెరువులలో  నిలువ చేసుకునే విధంగా తీర్చిదిద్దాం. గ్రామాల్లో కాకుండా పట్టణాల్లో కూడా వర్షం నీటిని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.

2014 కు పూర్వం ఖమ్మం లో 25 వేల కులాయిలు ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో 75 వేల పంపు కనెక్షన్ ఇచ్చాము. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల రాష్ట్రంలో కరువును పారదోలారు సీఎం కేసీఆర్. కాలేశ్వరం ప్రాజెక్టుపై డిస్కవరీ ఛానల్ డాక్యుమెంట్ చిత్రీకరించిందన్నారు.

ఆధునిక కాటన్ దొర సీఎం కేసీఆర్. చెరువుల మీద ముదిరాజులకు, సొసైటీలకు హక్కు కల్పించాము. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగటం వల్ల బ్రహ్మాండంగా తింటున్నాం, బ్రహ్మాండంగా బట్టలు కట్టుకుంటున్నాం, బ్రహ్మాండంగా జీవిస్తున్నాం. ప్రజల సంపదను సీఎం కేసీఆర్ పెంచడం వల్ల రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయి. పనికిమాలిన విపక్ష పార్టీలు కడుపునొప్పితో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం రాష్ట్రంలో ఊరూరా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలే. 21 రోజులు పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Latest News

More Articles