Sunday, May 19, 2024

లెజెండరీ సీఎం క్యాబినెట్ లో మంత్రిగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం

spot_img

ఖమ్మం నగరంలో ప్రైవేట్ స్కూల్స్ అధ్వర్యంలో నిర్మల్ హృదయ స్కూల్ ఆవరణలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఏఎంసీ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ లు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ కామెంట్స్ మాట్లాడుతూ.. ‘కేసీఅర్ లాంటి లెజెండరీ ఉద్యమ నేత.. లెజెండరీ ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మంత్రి గా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. ఉద్యమ నేతనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం గొప్ప విషయం. ఎమ్మేల్యేగా అయిన నాడు ఏమి లేని ఖమ్మంను నా చేతిలో పెట్టారు. నేను ఎమ్మల్యేగా అయిన నాటికి ఖమ్మంలో పాత బస్టాండ్, పాత ప్రభుత్వ ఆసుపత్రి, నాలుగు రోడ్లు, ట్రాఫిక్ జామ్ లు.. సరిగ్గా ఒక కుటుంబంతో బయటకి వెళ్లి గడపడానికి ఒక్క ప్రదేశం కూడా లేదు.

కాని నేడు ఖమ్మంలో ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ పదుల సంఖ్యలో ఆహ్లాదం పంచే పార్కులు, ఆట ప్రదేశాలు, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశాం. ఖమ్మం నగరంలో అనేక చోట్ల పార్కులు, గ్రంధాలయం, ట్యాంక్ బండ్ లో అనేక ఆహ్లాదకర ప్రదేశాలు, త్రాగునీరు కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ లు, ఓపెన్ జిమ్ లు, NSP కేనాల్ వాకింగ్ ట్రాక్ లు, నూతన బస్ స్టాండ్, సర్దార్ పటేల్ స్టేడియం లో వివిధ ఇండోర్ ఔట్ డోర్ క్రీడా స్టేడియంలు, రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ లు ఇలా అనేక అభివృద్ది పనులు చేసి మీకు అందించిన. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి.. ఖమ్మం అభివృద్ది కోసం చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటిని పూర్తి చేయాలనే తృష్ణతో ఉన్న. మళ్ళీ గెలిచిన తరువాత వాటన్నిటిని కూడా చేసి మీకు అందిస్తా. 76 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో ఖమ్మం నియోజకవర్గంకు మంత్రి పదవి ఎప్పుడూ, ఏ ప్రభుత్వం ఇవ్వలే. ముఖ్యమంత్రి కేసీఅర్ గారు నాకు ఆ అవకాశం ఇచ్చారు.. వారు క్యాబినెట్ లో మంత్రి పదవి రావడం వల్ల నేడు వేల కోట్ల నిధులు తీసుకురాగలిగినం’ అని అన్నారు మంత్రి పువ్వాడ.

Latest News

More Articles