Monday, May 20, 2024

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లా రైతుల ఆర్తి తీరుస్తాం

spot_img

ఖమ్మం జిల్లా: దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూప్డ్ పార్కింగ్ సౌకర్యం కలిగిన కలెక్టరేట్ ఖమ్మం కలెక్టరేట్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నంబర్ వన్ గా నిలిచింది. జల విద్యుత్ కేంద్రాలు ఉన్న కృష్ణా బేసిన్ లో చుక్క నీరు లేకపోయినా ఇవాళ 24 గంటల కరెంటు ఇస్తున్నాం. తెలంగాణ ఏర్పడేనాటికి నామమాత్రంగా ఉన్న స్థాపిత విద్యుత్తును సీఎం కేసీఆర్ 25 వేల మెగావాట్లవైపు తీసుకుపోతున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి:  బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల సంక్షేమం

ప్రభుత్వ ఉద్యోగులకు మొదటిసారి 40% రెండోసారి 30% ఫిట్మెంట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నాం. వీఆర్ఏలు , వీఆర్వోలు , వీఏవో లు సహా అందరు ప్రభుత్వ ఉద్యోగులను కేసీఆర్ ఆదుకున్నారు. కేసీఆర్ ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడంలో ఉద్యోగులు సహకారం అందించాలి.  తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద వందల కొద్ది కేసులు వేసినా , మొక్కవోని దీక్షతో వాటిని పూర్తి చేసిన ఘనత కేసిఆర్ ది అని పేర్కొన్నారు. మానవ నిర్మిత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల ఆర్తి తీరుస్తామని ప్రకటించారు.

Latest News

More Articles