Saturday, May 18, 2024

నేడు మన చెరువుల్లోనే పుష్కలంగా చేపలు

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ….నాడు చేపల కోసం ఆంధ్ర మీద ఆధారపడే వాళ్ళమని….నేడు మన చెరువుల్లోనే చేపలు పుష్కలంగా లభిస్తున్నాయన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా 27 వేల పై చిలుకు చెరువుల్లో, 3 ఏళ్ళలో 10 వేల కోట్లు ఖర్చు పెట్టి పూడికతీత పనులు చేపట్టి సత్పలితాలు సాధించినట్లు తెలిపారు. నాడు ఎండిన చెరువులతో, పశువుల కోసం తొట్టిలు కడుతుండే వారని నేడు ఎండాకాలంలో కూడా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండాల మారాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భూగర్భ జలాలు భారీగా పెరిగి 5 మీటర్ల పైకి నీరు  వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, జిల్లా ఫిషరీష్ అధికారి సుకృతి, అధికారులు, మృత్సకారులు, ప్రజలు పాల్గొన్నారు.

Latest News

More Articles