Saturday, May 18, 2024

అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి

spot_img

మధురానగర్ లోని మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సమ్మెపై స్పందించారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ‘అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి. మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దు. న్యాయ మైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం కరెక్ట్ కాదు. సమాజంలో గర్భిణీలు, బాలింతలు,చిన్నారులు ఎక్కువమంది బలహీన వర్గాల వారే వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు. సర్వీస్ అపవద్దు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేస్తుంది. వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరు కావాలి. కొందరు ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం కష్టం.కేంద్ర ప్రభుత్వనికి అంగన్ వాడీ ల తరుపున లేఖ రాస్తాం. అవసరమైతే కేంద్ర మంత్రులను కలిసి అప్పీల్ చేస్తాం. ప్రభుత్వం ఉద్యోగుల మాదిరే పిఆర్సి ని ఇస్తాం. అంగన్వాడీలు రెగ్యులర్ చేయాలని డిమాండ్ కేంద్ర పరిధిలోని అంశం. ప్రతి నెల 14 వరకు జీతాలు చెల్లిస్తాం. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ లో ఇచ్చే జీతాలు ఇవ్వడం లేదు’ అని అన్నారు సత్యవతి రాథోడ్.

Latest News

More Articles