Saturday, May 18, 2024

కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలు దేశానికి వర్తించవా..

spot_img

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పార్టీనా.. జాతీయ పార్టీనా అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రశ్నించారు. ఇవాళ(గురువారం) భూపాలపల్లి అసెంబ్లీ స్థానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్‌ వేయగా ఆయనతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిలు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని జయశంకర్‌ చౌక్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.. కాంగ్రెస్‌ పార్టీ ఆరు హామీలతో తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ఆరు హామీలు కేవలం తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయని హామీలను తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తారా? అని అన్నారు.

కేవలం తెలంగాణపైనే కాంగ్రెస్ ఈ కపట ప్రేమ కనబరుస్తోందని.. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంత్రి సత్యవతి. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దామన్నారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి నా కాళ్ళు మొక్కిండు

Latest News

More Articles