Saturday, May 18, 2024

కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవు

spot_img

67 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, తొమ్మిదేళ్లుగా కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌. గూడూరు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండల బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు మంత్రి సత్యవతి. గత ప్రభుత్వాల పాలనలో కరెంట్‌ లేక అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మళ్లీ అలాంటి పరిస్థితిలు రావద్దు అంటే బీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉంది. గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారే తప్పా అభివృద్ధి చేయలేదన్నారు.

తండాలను గ్రామ పంచాయతీలు చేసి, గిరిజనులకే పాలించుకునే అవకాశం కల్పించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌. ప్రజలందరూ సీఎం కేసీఆర్‌ పక్షాన నిలబడి మరోమారు సీఎం చేయాలని కోరారు. మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్ నాయక్ ప్రజల్లో ఉండి, నియోజక అభివృద్ధి కోసం కృషి చేసారు. మరోసారి శంకర్ నాయక్‌ణను గెలిపించుకొని ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ లో 32 మంది సీఎం అభ్యర్థులున్నారు

Latest News

More Articles