Saturday, May 18, 2024

తెలంగాణలో సాహిత్యానికి పూర్వ వైభవం

spot_img

శ్రీ కాళోజీ సాహిత్య పురస్కారం అందుకున్న శ్రీ గొడిశాల జయరాజుకి మహాబాబుబాద్ లోని కలెక్టర్ కార్యాలయం సన్మాన కార్యక్రమం జరిగిందో. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రంలో కవులు , కళాకారులు, రచయితలను సమచితమైన గౌరవ దక్కుతుంది.
శ్రీ కాళోజీ సాహిత్య పురస్కారం అందుకున్న గొడిశాల జయరాజు గారిని సన్మానించుకోవడం జిల్లాను సన్మానించుకున్నంత గొప్పగా ఉంది. గాయకుడు జయరాజ్ పల్లె ప్రకృతిని, మట్టి వాసనను చూపే విధంగా అతని కవితలు,పాటలు ఉంటాయి. ఒకప్పుడు తెలంగాణ భాష, యాస తెలంగాణ సాంస్కృతి అన్నా ఒక చిన్న చూపు ఉండేది.

స్వరాష్ట్రంలో తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్  రచన, పద్యం, కవితలను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు పింఛన్లు సైతం అందజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సాహిత్యానికి పూర్వ వైభవం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా గొప్పది. కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుండే సాహిత్యం పాత్ర గొప్పది, కాలాన్ని ముందే పసిగట్టి హెచ్చరిక చేసే వారు కవులు, ఒక పుస్తకాన్ని ఒక వ్యాఖ్యలో చెప్పే ఘనత ఒక కవికి మాత్రమే సాధ్యమవుతుంది. కవిత్వానికి ఉండే పదును, శక్తి మరి దేనికీ ఉండదు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన కవిత్వం ప్రజలను కదిలించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ర్టంలోని కవులకు అంతే ప్రాధాన్యతను ఇవ్వడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం.

Latest News

More Articles