Monday, May 20, 2024

పాలమూరు వాసుల కల నెరవేరింది.. మహా శివునికి కృష్ణా జలాలతో జలాభిషేకం

spot_img

మహబూబ్ నగర్: త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాలువలను నిర్మించి ఉమ్మడి జిల్లా పరిధిలోని బీడు భూములన్నింటిని బంగారు పంటలు పండే నేలలుగా మార్చేస్తామని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేయడంతో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ నెరవేరిందని ఆయన తెలిపారు.

Also Read..బంగారు తెలంగాణ సాధనకు సమైక్యంగా కృషి చేద్దాం

శనివారం నాడు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను కలశాలతో తీసుకువచ్చి మంత్రి ఇవాళ జిల్లా కేంద్రంలోని మోనేశ్వర స్వామి దేవాలయంలో మహా శివునికి జలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, మహా యజ్ఞం కార్యక్రమానికి హాజరై కృష్ణా జలాలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Aslo Read.. కొత్త సీన్స్‌తో ‘జవాన్‌’ ఓటీటీ రిలీజ్‌..!!

ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు… తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో ఉమ్మడి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసుకున్నామని… బతుకుదెరువు అంటే పాలమూరే అనేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. వచ్చే ఏడాది నాటికి జిల్లాలోని భూములు అన్నింటికీ సాగునీటిని అందేలా చేస్తామన్నారు. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న బీసీల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.

Latest News

More Articles