Friday, May 17, 2024

చరిత్ర సృష్టించిన సిరాజ్.. 50 పరుగులకే కుప్పకూలిన లంక

spot_img

Asia Cup 2023 : భార‌త జ‌ట్టు ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ టాపార్డర్ కుప్పకూలింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత పేస్ బౌలర్లు దుమ్ములేపారు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులు వేయడంతో లంక బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు.

భారత బౌలర్ల విజృంభనతో లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ అయింది. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీసారు. ఆసియా కప్ ను భారత్ చేజిక్కించుకునేందుకు 50 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి ఉంది.వ‌న్డే్ల్లో శ్రీ‌లంకు ఇదే రెండో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఆరేసిన సిరాజ్ 

సూప‌ర్ రిథ‌మ్‌లో ఉన్న భార‌త పేస‌ర్ సిరాజ్ ఆరు వికెట్లు తీశాడు. 7 ఓవర్లు వేసిన సిరాజ్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఓకే ఓవర్ లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్ నిలిచాడు. అలాగే వన్డే మ్యాచులో అత్యంత వేగంగా (16 బంతుల్లో) 5 వికెట్లు తీసిన బౌలర్ గా శ్రీలంక బౌలర్ చమిందావాస్ రికార్డును సమం చేశారు.

మరిన్ని వార్తలు: 

Latest News

More Articles