Monday, May 13, 2024

పాలమూరు జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల పంపిణీ

spot_img
  • జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
  • ఈ రోజు రాని వాళ్ళు ఎవరు అధైర్య పడొద్దు… వారం పది రోజుల్లో అందరికీ పట్టాలు ఇస్తా…
  • పాలమూరు జర్నలిస్టుల ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాలమూరు జర్నలిస్టులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ వరాలు కురిపించారు. కొన్ని సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, కేటాయింపు విషయంలో మంత్రి శీనన్న పెద్ద మనసు చేసుకుని అడుగు ముందుకు వేసి పాలమూరు జిల్లాలో 155 మంది జర్నలిస్టులకు శనివారం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్.. అభివృద్ధి పనులలో భాగంగా ఏది అడిగినా వెంటనే మంజూరు చేస్తూ పాలమూరు ప్రజానీకంపై ఎనలేని అభిమానాన్ని చాటుతున్నారన్నారు. అందులో భాగంగానే వివిధ పత్రిక, మీడియా ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేశామన్నారు. ఇండ్లు రానీ మిగతా జర్నలిస్టులు సంయమనం పాటించాలన్నారు. మరో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి, అర్హులైన అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి హామీ ఇచ్చారు. ఏనుగొండ, మౌలాలి గుట్ట ప్రాంతాలలో 155 మందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మంత్రి పంపిణీ చేశారు. విలేకరుల కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానన్నారు. అదే విధంగా పిల్లల చదువు, ఉపాధి కల్పనల్లో అందరికీ సహకారం చేస్తామన్నారు.

Latest News

More Articles