Sunday, April 28, 2024

రూ.2,000 నోట్లను మార్చేందుకు ఐడీ ప్రూఫ్ ఇవ్వాలి!

spot_img

రూ.2,000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది ఆర్బీఐ. ప్రజలు తమ దగ్గరున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని.. లేదంటే మార్చుకోవాలని కోరింది. దీంతో అన్ని బ్యాంకుల్లోనూ నోట్ల డిపాజిట్, మార్పిడి కార్యక్రమం మొదలైంది. అధిక శాతం ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులు కాకుండా, రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు వచ్చే ఇతరుల నుంచి గుర్తింపు ఐడీ వివరాలను తీసుకుంటున్నాయి. ఒకవేళ అదే బ్యాంకు కస్టమర్ అయినా సరే.. నోట్ల మార్పిడి సమయంలో ఖాతా నంబర్ వివరాలు తీసుకుంటున్నాయి.

పీఎన్బీ, ఎస్బీఐ సొంత కస్టమర్లు అయితే ఖాతా నంబర్ ఒకటి తీసుకుంటున్నాయి. ఇతర బ్యాంకు కస్టమర్ అయితే..పేరు, మొబైల్ నంబర్, ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ లేదా పాస్ పోర్ట్ లేదా పాన్ తదితర ఏదేని ఒక గుర్తింపు వివరాలు అడుగుతోంది.

Latest News

More Articles